29-01-2025 బుధవారం దినఫలితాలు : పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

రామన్

బుధవారం, 29 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. కీలక చర్చల్లో పాల్గొంటారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. కొత్తప్రదేశాన్ని సందర్శిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు స్థిమితంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన తగ్గి స్థిమితపడతారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. పాతమిత్రులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ధైర్యంగా యత్నాలు కొనసాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. మొండిగా పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ప్రయాణం తలపెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కృషి ఫలిస్తుంది. విజ్ఞతతో అందరినీ ఆకట్టుకుంటారు. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. మానసికంగా స్థిమితపడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
స్థిమితంగా ఆలోచించి అడుగు ముందుకేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. నోటీసులు అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. చిన్న విషయానికే చికాకుపడతారు. చేసిన పనులే తిరిగి చేయవవలసి వస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సామాన్యం. కొత్తయత్నాలు ప్రారంభిస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు