సంతోషకరమైన వార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. అనవసర జోక్యం తగదు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సన్నిహితుల సలహా పాటించండి. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ప్రయాణం తలపెడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చాకచక్యంగా అడుగులేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. కీలక విషయాలపై దృష్టి పెడతారు.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు స్థిమితంగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. సన్నిహితులతో సంభాషిస్తారు. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది.
ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, ఉంది. ఖర్చులు అధికం. దూరపు బంధువులను కలుసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. కొత్త యతాలు మొదలెడతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. వ్యవహారాలతో సతమతమవుతారు. సన్నిహితులను సంప్రదిస్తారు. కీలక అంశాలపై దృష్టి పెడతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. బెట్టింగులకు పాల్పడవద్దు.
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు కొనసాగించండి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది.
పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు.