పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి.
ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రముఖుల సలహా పాటిస్తాం కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవకాశాలు కలిసివస్తాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. రావల్సిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి.
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిపుణుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. రుణసమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు సామాన్యం. అప్రియమైన వార్త వినవనలసి వస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అన్యమస్కంగా గడుపుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలు మొదలెడతారు. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం విరమించుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. కీలక పత్రాలు అందుకుంటారు.
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. పనుల్లో ఒత్తిడి అధికం. మాటతీరు అదుపులో ఉంచుకోండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
మీరు సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ముఖ్య సమావేశంలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. కిట్టని వ్యక్తులు మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం. సన్నిహితుల హితవు మీపై పనిచేస్తుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. నోటీసులు అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.