వ్యవహారానుకూలత వుండదు. కొన్ని సంఘటనలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. రుణ ఒత్తిళ్లు అధికం. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఏ సంబంధం కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం చదువులపై మరింశ శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణంలో చికాకులు తప్పవు.
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. ఏ విషయంపైన ఆసక్తి వుండదు. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఆప్తుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. కొత్త సమస్యలెదురయ్యే ఆస్కారం వుంది. అప్రమత్తంగా మెలగాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి వుంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ మాసం యోగదాయకం. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. అధికారులకు బాధ్యతల మార్పు, పనిభారం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. చేతివృత్తుల వారికి ఆశాజనకం. వేడుకల్లో పాల్గొంటారు. పందాల జోలికి పోవద్దు.
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని రంగాల వారికి శుభదాయకమే. వాగ్దాటితో నెట్టుకొస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పొదుపు మూలక ధనం అందుకుంటారు. వివాహ యత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. సాధ్యంకాని హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు విపరీతం, డబ్బుకు ఇబ్బంది వుండదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం పట్ల మెలకువ వహించండి. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, విశ్రాంతి లోపం. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ధన యోగం వుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు యత్నం ఫలిస్తుంది. పెద్దమొత్తం ధన సహాయం తగదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గుట్టుగా యత్నాలు సాహించండి. ఆహ్వానాలు అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారాలుకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయ పాలన ప్రధానం. శుభకార్యంలో పాల్గొంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పందేల జోలికి పోవద్దు.
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలను వదులుకోవద్దు. మాటతీరు అదుపులో వుంచుకోండి. సన్నిహితుల సాయంతో ఓ సమస్య సానుకూలమవుతోంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవివాహితులకు నిరుత్సాహకరం. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. పరిచయం లేనివారితో జాగ్రత్త. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. మీ శ్రీమిత సలహా పాటించండి. ఆరోగ్యం సంతృప్తికరం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ కార్యంలో పాల్గొంటారు.
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పొదుపు ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. బంధుమిత్రుల ధనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ జోక్యం అనివార్యం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. పత్రాలు, నగదు జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం ప్రధమార్థం అంత అనుకూలం కాదు. వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం వుంది. అనాలోచిత నిర్ణయాలు తగవు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఆత్మీయుల సలహా పాటించండి. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఖర్చులు సామాన్యం. డబ్బుకు ఇబ్బంది వుండదు. కొంత మొత్తం ధనం అందుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. స్వల్ప అశ్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరం. సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు.
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. అప్రమత్తంగా వుండాలి కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడుతారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. గృహ మార్పు చికాకుపరుస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. జూదాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
ఈ మాసం ప్రథమార్ధం అనుకూలం. అవకాశాలు కలిసివస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ధనయోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ద్వితీయార్థంలో ఆచితూచి వ్యవహరించాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. వ్యతిరేకులతో జాగ్రత్త. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మానసికంగా కుదుటపడుతారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పేడుకల్లో అత్యుత్సాహం తగదు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారానుకూలత వుంది. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వాస్తుకు అనుగుణంగా మరమ్మతులు చేపడుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. వస్త్ర, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు.
మీన రాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులతో హడావుడిగా వుంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. పరిచయాలు, వ్యాపకాలు బలపడతాయి. ధనయోగం వుంది. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవివాహితుల శుభయోగం. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. గృహమార్పు చికాకు పరుస్తుంది. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకంరా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. నూతన వ్యాపారాలకు అనుకూలం. వేడుకలకు హాజరవుతారు.