పురాణాల ప్రకారం, ఒక వ్యక్తిని అన్ని రకాల నాగదోషం (పాము బాధలు) నుండి ఉపశమనానికి గరుడుడు శక్తిమంతుడు. కేవలం మంత్రోచ్ఛారణలతోనే ప్రసన్నుడవుతాడు. గరుడ గాయత్రి, గరుడ వశీకరణం, గరుడ దండకం గరుడ కవచం వంటి గరుడుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలను రోజూ 108 సార్లు జపిస్తే గరుడుని అనుగ్రహం లభిస్తుంది.
ఈ గరుడ మంత్రాలన్నీ ఈ కలియుగంలో చాలా శక్తివంతమైన మంత్రాలు. ఈ మంత్రాన్ని 1008 సార్లు.. 108 రోజులు జపిస్తే, అంటే శుక్ల పక్ష పంచమి తిథి.. గరుడ పంచమి రోజున ప్రారంభిస్తే చాలా శుభప్రదం. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అలాగే 12 తరాల వరకు అన్ని రకాల సర్ప దోషాలు (కాల సర్ప దోషాలు), నాగ దోషాలు, రాహు దోషాలు, కేతు దోషాలు, దురదృష్టాల నుండి విముక్తి పొందగలరని విశ్వాసం. మంచి ఆరోగ్యం, సమృద్ధి, సంపద, సంతోషకరమైన వివాహ జీవితం, సత్ సంతానం ప్రసాదించగలడని విశ్వాసం.