మీరు చతుర్దశి శుక్రవారం, వృషభలగ్నము, రేవతి నక్షత్రం మీన రాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషనం ఉన్నందువల్ల తలపెట్టిన పనిలో అవరోధాలు ఆటంకాలు, చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు. ప్రతీ శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి సువర్ణగన్నేరు పూలతో శనిని పూజించినట్లైతే దోషాలు తొలగిపోతాయి.
మీరు విదేశాలలో కంటే స్వదేశాలలో బాగా రాణిస్తారు. 2012 అక్టోబర్ తదుపరి మీకు మంచి అవకాశం లభిస్తుంది. సద్వినియోగం చేసుకోండి. భార్యస్థానము నందు భాగ్య, రాజ్యాధిపతి అయిన శని ఉండటం వల్ల, వివాహానంతరం మీరు బాగా రాణిస్తారు. 2013 లేక 2014 నందు వివాహం అవ్వడం మీ అభివృద్ధికి నాంది పలుకుతుంది. ప్రతీరోజూ కనకధారా స్తోత్రం చదవడం లేక వినడం వల్ల మీకు శుభం కలుగుతుంది.