మీరు సప్తమి మంగళవారం, మకరలగ్నము, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. భాగ్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొనే ప్రయత్నం చేయండి.
ఈ చికాకులు 2014 వరకు ఉండగలవు. 2009 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 2014 నుంచి 2027 వరకు ప్రశాంతతను అభివృద్ధిని ఇస్తుంది. ప్రతీరోజూ కనకదుర్గా అమ్మవారిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. ఈ క్రింది శ్లోకాన్ని 108 సార్లు పఠించినా మీకు శుభం కలుగుతుంది.