ఎన్. నరేష్ గారూ.. కనకదుర్గమ్మను పూజించండి.

గురువారం, 10 మే 2012 (17:45 IST)
FILE
ఎన్. నరేష్-మంచిర్యాల:

మీరు పంచమి సోమవారం, కుంభలగ్నము, రోహిణి నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. రాజ్యాధిపతి అయిన కుజుడు, గురు చంద్రులతో కలిసి చతుర్ధము నందు ఉండటం వల్ల మీరు ప్రైవేట్ లేక వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు. మీ ఆలోచనలను క్రియారూపంలో పెట్టి జయం పొందండి. 1999 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది.

ఈ రాహువు 2017 వరకు సామాన్యంగా ఉండగలదు. ఈ రాహువు 2013 నుంచి 2017 వరకు యోగాన్ని నెమ్మదిగా ఇవ్వగలదు. తదుపరి గురు మహర్ధశ 16 సంవత్సరాలు మంచి యోగాన్ని అనుభవిస్తారు. కనకదుర్గా అమ్మవారిని పూజించండి. సత్ఫలితాలు పొందుతారు.

వెబ్దునియా పై చదవండి