మీరు చవితి గురువారం, తులాలగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉచ్ఛి చెంది ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఒకేదాని కోసం ఎదురు చూడటం కాకుండా ఎటువంటి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోండి.
భాగ్యస్థానము నందు కుజుడు ఉండటం వల్ల మీరు తాత్కాలికంగా ఉద్యోగం చేసినా భవిష్యత్తులో వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. 2012 ఆగస్టు నుంచి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. 2014 నుంచి 2022 వరకు మిగిలిన రాహు మహర్ధశ యోగాన్ని ఇవ్వగలదు. గజలక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.