నవతేజ గారూ.. మాసశివరాత్రికి శివుడికి అభిషేకం చేయించండి

మంగళవారం, 15 మే 2012 (17:31 IST)
FILE
నవతేజ
మీరు పంచమి ఆదివారం, కన్యాలగ్నము, ఉత్తరా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల అప్పుడప్పుడు ఆరోగ్యములో సమస్యలు ఎదుర్కొన్నా సమసిపోతాయి. ప్రతీ మాసశివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయించినా ఆరోగ్యము చేకూరుతుంది.

లాభస్థానము నందు రవి, బుధ, కేతువులు ఉండటం వల్ల మీరు సాంకేతిక, ఎంబీఏ వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. మీ 24 లేక 25వ సంవత్సరము నందు ఉన్నత స్థితిలో స్థిరపడతారు. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. జ్ఞానసరస్వతిని పూజించడం వల్ల అభివృద్ధిని పొందుతారు.

వెబ్దునియా పై చదవండి