ప్రతీ మాస శివరాత్రికి అభిషేకం చేయించినా దోషాలు తొలగిపోతాయి
సోమవారం, 7 మే 2012 (11:40 IST)
FILE
వరప్రసాద్-కరీంనగర్:
మీరు పంచమి శనివారం వృషభలగ్నము, మృగశిర నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. చతుర్థస్థానము నందు అష్టమాధిపతి అయిన బృహస్పతిని రాహువు పట్టడం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల శంకపాలకాలసర్పదోషం శాంతి చేయించండి. పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు అధికమయ్యే అవకాశం ఉంది.
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రతీ మాస శివరాత్రికి అభిషేకం చేయించినా దోషాలు తొలగిపోతాయి. 2018 వరకు గురుమహర్ధశ కలదు. ఈ మహర్ధశ మీకు సామాన్యంగా ఉండగలదు. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించినా సర్వదాశుభం కలుగుతుంది. పుష్యనీలం అనే రాయిని ధరించినా పురోభివృద్ధి పొందుతారు.
మీ భార్య: షష్ఠి శుక్రవారం, కుంభలగ్నము, జ్యేష్ట నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించి 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి చామంతి పూలతో శనిని పూజించినట్లైతే దోషాలు తొలగిపోతాయి.
ద్వితీయము నందు రవి, శుక్ర, కుజులు ఉండటం వల్ల కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. 2017 వరకు శుక్ర మహర్ధశ ఉంది. ఈ శుక్రుడు 2013 డిసెంబర్ నుంచి 2017 వరకు ఇబ్బంది లేకపోయినా ఆరోగ్యములో మెళకువ అవసరం.