లక్ష్మీప్రసన్నకుమార్ గారూ.. మీ జాతక పొంతన బాగుంది..
బుధవారం, 9 మే 2012 (18:14 IST)
FILE
ఎమ్. లక్ష్మీప్రసన్నకుమార్- తిరుపతి:
మీరు సప్తమి ఆదివారం, కుంభలగ్నము, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. మనఃకారకుడైన చంద్రుడు రాహువుతో కలయిక వల్ల, ప్రతీ చిన్న విషయానికి ఆందోళన చెందడం, సున్నిత హృదయులుగా ఉంటారు. వాసుకీకాల సర్పదోషం ఉన్నందున శాంతి చేయించండి. మీకు అన్నివిధాలా శుభం కలుగుతుంది. వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు.
పి. హైమావతి: తదియ శుక్రవారం, మేషలగ్నము, పుష్యమి నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. మీ ఇద్దరికీ 23 పాయింట్లు కుదిరినందువల్ల జాతక పొంతన బాగుంది.