మీరు చవితి బుధవారం కర్కాటకలగ్నము, ఉత్తరా నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీశనివారం 9 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి. ధనస్థానము నందు చంద్రుడు ఉండటం వల్ల మీరు బాగా స్థిరపడతారు. మీ 27 లేక 28వ సంవత్సరము నందు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ కార్పోరేట్ సంస్థల్లో స్థిరపడతారు. మీ 29 సంవత్సరము నుంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది.
మీ 27 లేక 28వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. మూడు నెలలకు ఒక ఏకాదశి నాడు సత్యనారాయణస్వామి వ్రతం చేయించండి. ఆటంకాలు తొలగి శుభం కలుగుతుంది. రాజ్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల, మంచి మంచి అవకాశాలు చేజారిపోతున్నాయి. ఈ సంవత్సరము ఆగస్టు నుంచి దోషాలు తొలగిపోతున్నాయి.