మీరు తదియ శుక్రవారం, కుంభలగ్నము, అశ్వని నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. లగ్నము నందు శుక్ర, కేతువులు ఉండటం వల్ల, సప్తమస్థానము నందు శని, రాహువులు ఉండటం వల్ల గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించడం వల్ల, తక్షక కాలసర్పదోష శాంతి చేయించండి. మీకు శుభం కలుగుతుంది.
మీకు మంచి మంచి ఆలోచనలు, ఆశయాలు ఉన్నా క్రియా రూపంలో పెట్టినా జయం పొందుతారు. 2006 నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు 2016 వరకు 70 శాతం యోగాన్ని ఇస్తాడు.
నెమ్మదిగా పురోభివృద్ధి పొందుతారు. తదుపరి కుజ మహర్ధశ ఏడు సంవత్సరాలు, రాహువు 18 సంవత్సరాలు మంచి యోగాన్ని ఇవ్వగలదు. శక్తి గణపతిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది.