శ్రీని.. మీరు.. ఐశ్వర్యప్రదాత అయిన ఈశ్వరుని పూజించండి

సోమవారం, 21 మే 2012 (18:19 IST)
FILE
శ్రీని-వరంగల్ :

మీరు ఏకాదశి ఆదివారం వృషభలగ్నము శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టుతో అష్టమ శనిదోషం తొలగిపోతుంది. "సిరిదా వచ్చినా వచ్చును" అన్నట్టుగా 2013 నుంచి మంచి భవిష్యత్తు ఉంది. రవి ఉచ్ఛి చెందడం వల్ల లాభస్థానము నందు శుక్రుడు ఉచ్చి చెందడం వల్ల మీరు మంచి సంస్థల్లో స్థిరపడలేకపోతున్నారు.

2013 నుంచి 2030 వరకు మిగిలిన శని మహర్ధశ మంచి యోగాన్ని, అభివృద్ధినిస్తుంది. ఐశ్వర్యప్రదాత అయిన ఈశ్వరుని పూజించండి. మీ 34లేక 35వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. అనంతరం బాగా అభివృద్ధి చెందుతారు.

వెబ్దునియా పై చదవండి