మీరు తదియ మంగళవారం మేషలగ్నము, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. లగ్నము నందు చంద్రుడు ఉండటం వల్ల మీకు మంచి మంచి ఆలోచనలు, ఆశయాలు కలిగిన వారుగా ఉంటారు. నిరుత్సాహాన్ని విడనాడి అధిక కృషి చేయండి. మీరు మంచి మంచి సంస్తల్లో స్థిరపడతారు.
బంధుమిత్రులతో మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. 2015 వరకు కుజ మహర్ధశ సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి రాహు మహర్ధశ 19 సంవత్సరాలు ఉన్నత స్థితిలో స్థిరపడతారు. కార్తికేయుడుని పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.