సి.హెచ్. మురళీకృష్ణ గారూ.. వేణుగోపాలస్వామిని అర్చించండి

శుక్రవారం, 11 మే 2012 (17:45 IST)
FILE
సి.హెచ్. మురళీకృష్ణ

మీరు దశమి మంగళవారం, సింహలగ్నము, శ్రవణ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. ద్వితీయము నందు రవి, బుధులు ఉండటం వల్ల బుధాదిత్యయోగం ఏర్పడింది. ఈ యోగం మీకు మంచి ఫలితాలనిస్తుంది. ఆరోగ్యంలో మెళకువ అవసరం. కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు.

2013 జూలై వరకు గురు మహర్ధశ సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి శని మహర్ధశ 19 సంవత్సరాలు సత్ఫలితాలను ఇచ్చినా ఆరోగ్యములో అధికమైన సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యములో జాగ్రత్త వహించండి. వేణుగోపాలస్వామిని అర్చించినట్లైతే మీకు ఆరోగ్యము చేకూరుతుంది.

వెబ్దునియా పై చదవండి