28-03-2021 నుంచి 03-04-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

శనివారం, 27 మార్చి 2021 (22:24 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగువేయాలి. సొంత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆదాయవ్యయాలకు పొంతన వుండదు. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పట్టుదలతో శ్రమించినగాని పనులు పూర్తికావు. ఒక ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. అనవసర జోక్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు అదనపు బాధ్యతలు. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయానికి లోటు లేకున్నా వెలితిగా వుంటుంది. ఖర్చులు సామాన్యం. అవకాశాలు కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితుల హితవు సత్ర్పభావం చూపుతుంది. పనులు మొండిగా పూర్తిచేస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. సంస్థల స్థాపనకు తరుణం కాదు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. ద్విచక్రవాహన చోదకులకు దూకుడు తగదు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యవహారానుకూలత వుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. శుక్ర, శనివారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. మాటతీరు అదుపులో వుంచుకోండి. వాగ్వాదాలకు దిగవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ప్రేమ వ్యవహారాలు సమస్యాత్మకమవుతాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆది, గురు వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కార్మికులు, చేతివృత్తుల వారికి పురోభివృద్ధి. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దల సలహా పాటించండి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది వుండదు. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. సోమ, మంగళవారాల్లో బాధ్యతగా వ్యవహరించాలి. వాగ్వాదాలకు దూరంగా వుండండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపకాలు సృష్టించుకోండి. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో నిరుత్సాహం తప్పదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సమావేశాల్లో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. బుధవారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగండి. నేడు అనుకూలించని పరిస్థితులు రేపు కలిసివస్తాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహలు, సహాయం ఆశించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. పోగొట్టుకున్న పత్రాలు లభిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లౌక్యంగా వ్యవహరించాలి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఏ పనీ చేయబుద్ధికాదు. గురు, శుక్ర వారాల్లో ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిస్తాయి. ఒక అవసరానికి వుంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ప్రియతములతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. అపరిచితులతో జాగ్రత్త. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అకౌంట్స్, మార్కెటింగ్ రంగాల వారికి శ్రమ అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. పరిచయాలు బలపడతాయి. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఏ విషయంపై ఆసక్తి వుండదు. దంపతుల మధ్య అవగాహనా లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. భేషజాలకు పోవద్దు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. గుట్టుగా వ్యవహరించండి. ఇంటి విషయాలు ఏకరవు పెట్టొద్దు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. పెట్టుబడులు కలిసిరావు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. చేతివృత్తులు, కార్మికులకు కష్టకాలం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదాపడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఉత్సాహంగా అడుగులేస్తారు. వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుతాయి. ఇరువర్గాల వారు మీ సలహా పాటిస్తారు. ఆది, సోమ వారాలలో పనుల్లో ఒత్తిడి అధికం. గృహమార్పు ఇబ్బంది కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పురోభివృద్ధి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు సామాన్యం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధ వారాలలో అప్రమత్తంగా వుండాలి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో అనుకూల పరిస్థితులు చక్కబడతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆది, గురు వారాలలో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. శుక్ర, శని వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వైద్య, న్యాయ, కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు