18-08-2024 నుంచి 24-08-2024 వరకు ఫలితాలు

రామన్

శనివారం, 17 ఆగస్టు 2024 (21:01 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పొదుపు ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. మీ శక్తిసామర్ధ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఉద్యోగ బాధ్యతల్లో అశ్రద్ధ తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ చిత్తశుద్ధిని చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గురు, శుక్ర వారాల్లో అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానానికి ఉద్యోగయోగం. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. 
 
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఎదుటివారు మీ వ్యాఖ్యలను అపార్ధం చేసుకుంటారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. మంగళవారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. సంతానం విద్యాయత్నాలు ఫలిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి, జాతక పొంతన ప్రధానం. గృహమరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వాహనదారులకు అత్యుత్సాహం తగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆది, సోమ వారాల్లో బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. సోదరులతో ఊహించని సమస్యలెదురవుతాయి. సామరస్యంగా మెలగండి. మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు. వేడుకలు, విందులకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా పరిగణించవద్దు. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. దంపతుల మధ్య అవగాహనలోపం. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు ఇతరులు విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. మానసికంగా కుదుటపడతారు. గృహమార్పు అనివార్యం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆదివారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. సంతానం దూకుడు కట్టడి చేయండి. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బంధుమిత్రులతో సంప్రదింపులు ఫలిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. తలపెట్టిన పనులు ఆకస్మింగా నిలిపివేస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. గుట్టుగా మెలగండి. కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రయాణం కలిసివస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం యోగదాయకమే. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు. అధికారులకు స్థానచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపాలకు ఆశాజనకం. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కీలక విషయాల్లో నిపుణుల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందరితోను సౌమ్యంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సోమ, మంగళ వారాల్లో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. పత్రాల్లో సవరణలు అనివార్యం. వేడుకకు హాజరుకాలేరు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. బుధవారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఇతరుల క్షేమం కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. హామీలు నిలబెట్టుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. అపరిచితులు మోసగించే ఆస్కారం ఉంది. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. అవివాహితులకు శుభయోగం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు