ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేశ్ ఫొగాట్ ఫైనల్ పోటీ ఆడకుండానే అనర్హత వేటుకు గురయ్యారు. మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో ఫైనల్ ఆడాల్సి ఉండగా, తినపి నిమిషంలో ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. దీంతో ఆమె పతకాన్ని గెలవలేక పోయారు. దీంతో ఆమె సీఎస్ఏను ఆశ్రయించారు. వినేశ్ తరపున భారతదేశానికి ప్రముఖ సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియాలు వాదనలు వినిపించారు.
ఇరు తరపు వాదనలు ఆలకించిన సీఎస్ఏ తుది తీర్పును మంగళవారం వెలువరిస్తుందని భావించారు. ఈ తీర్పుతో వినేశ్‌కు రజతపతకం వస్తుందని అందరూ భావించారు. అయితే, వినేశ్ అప్పీలుపై తీర్పును ఈ నెల 16వ తేదీకి సీఎస్ఏ వాయిదా వేసింది. వినేశ్ ఫొగాట్ వర్సెస్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వర్సెస్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కేసులో ఆర్బిట్రేటర్ డాక్టర్ అనబెల్లే బెన్నెట్ వాదనలు కూడా వినాలని సీఎస్ఏ నిర్ణయించింది. అందుకే తీర్పును ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం.