ఉసిరికాయతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఉసిరి కాయ జ్యూస్‌ను పరగడుపున తీసుకుంటే బరువు తగ్గుతారు. అలాగే ఇందులో సి విటమిన్ ద్వారా కాలేయ పనితీరు మెరుగు పడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వీర్యవృద్ధికి, కేశవృద్ధికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయలో పెద్ద నారింజ పండులో కంటే ఇరవై రెట్లు సి విటమిన్ లభిస్తుంది. ఉసిరి కాయ రక్తాన్ని శుభ్రపరచటంతో పాటు కఫాన్ని తగ్గిస్తుంది.
ఉసిరి కాలేయానికి పనికి వచ్చే లివర్‌టానిక్‌గా పనిచేస్తుంది. దీన్ని రోజు వినియోగిస్తే లివర్ పనితనం పెరిగి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. అజీర్ణం, గ్యాస్టిక్‌లకు ఉసిరికాయ ఔషధంగా పనిచేస్తుంది. తేనెతో కలిపి తాగితే కడుపులోని క్రిములు నశించి, పచ్చకామెర్లు, దగ్గు వంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.