అశ్వగంధ పొడిని టీలో కలుపుకుని తాగితే మెదడు నాడీ సంబంధిత ప్రసరణ మెరుగవుతుంది. అశ్వగంధం వేర్లను పొడి చేసుకుని పాలలో కలుపుకుని తాగితే అన్ని రకాల నొప్పులు నయం అవుతాయని అంటుంటారు. జ్ఞాపకశక్తిని తిరిగి ప్రసాదించే గుణం అశ్వగంధకి ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అశ్వగంధ లేహ్యాన్ని తీసుకుంటే కండరాల వ్యాధులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే అశ్వగంధంలో తెల్ల రక్తకణాలను బ్యాలెన్స్ చేసే శక్తి కూడా ఉంది. నాడీ వ్యవస్థను పునరుద్దపరచడానికి, నాడీ సంబంధిత వ్యాధులను తగ్గుముఖం పట్టించడానికి అశ్వగంధం ఎంతో ఉపయోగపడుతుంది.