ఈ మొక్క యవ్వనాన్ని పట్టిపెడుతుంది... తెలుసుకోండి...

శనివారం, 29 అక్టోబరు 2016 (19:02 IST)
వాతావరణ కాలుష్యం మనిషిని పట్టిపీడిస్తోంది. ఇలాంటి తరుణంలో రసాయినాలు కలిపిన మందులు వాడకం మరింత ప్రమాదకరం. వైద్యం కూడా ఖరీదైపోయింది. వెంట్రుకలు రాలిపోవడం, చర్మం ఎండిపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టి, యవ్వనంగా కనిపించాలంటే.. మందు మొక్కలు (వనమూలికలు) తక్కువ ఖర్చుతో ఎక్కవ ఫలితాలనిస్తున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
అశ్వగంది, రియోడియోలా రోసియా, రోకా వంటి మొక్కలు వయసుతో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఉపకరిస్తున్నాయి. అశ్వగంధి అనే మొక్క ప్రకృతి ప్రసాదించిన వైద్య మొక్క. వయసును కప్పి పెట్టడానికి అవస్థలు పడేవారికి వరప్రసాదిని. సహజంగానే దీనికి మనిషిని యవ్వనంగా ఉంచే లక్షణాలు ఉంటాయి. 
 
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుతాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించే వ్యవస్థకు ఇతోధికంగా దోహద పడుతాయి. మనిషిలోని ఆందోళన, ఆత్రుత, మానసిక వైరాగ్యాలను తగ్గిస్తుంది. అక్షనాళము, డెనడ్రాన్లను పెంపొందించి ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. 
 
రోహాలియా రోసియా(గులాబీ) ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇందులోని ఔషద గుణాలు దివ్యంగా ఉంటాయి. ఒత్తిడి నుంచి వెసులుబాటు కలిగిస్తూ శరీరంలోని కణాలకు కొత్త శక్తిని ఇస్తాయి. ఈ మొక్క వ్యాధినిరోధకతను పెంచడంతోపాటు మానసిక స్థితిని మెరుగు పరుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
గిన్సెంగ్‌ అనేది మంచి ఔషద మూలిక దీనిలో కూడా ఇదే విధంగా యవ్వనాన్ని పెంపొందించే లక్షణాలున్నాయి. ఈ మూలిక తీసుకున్న వారిలో ఉద్వేగం పెరగడంతోపాటు శారీరక దృఢత్వం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గడం, రక్త ప్రసరణను పెంచడం, శరీరంలో కొలస్ర్టాల్‌ను నియంత్రించడానికి ఇది దోహద పడతుంది. ఐతే ఈ మొక్కలను ఔషధాలుగా తీసుకునేవారు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి