జీర్ణక్రియను ఇంగువ మెరుగుపరుస్తుంది. అల్లం, తేనెతో కలిపి ఇంగువను తీసుకోవచ్చు. ఇది ప్రేగులలోని సూక్ష్మక్రిములను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అపానవాయువు, కడుపునొప్పి, మలబద్ధకాన్ని నయం చేస్తుంది.
అలాగే కోడిగుడ్డులోని పచ్చసొనతో ఇంగువను కలిపి తింటే పొడి దగ్గు దూరమవుతుంది. ఇంగువన శరీరంలోని వాత కఫాలను సమతుల్యం చేస్తుంది. ఇంగువను కాల్చడం.. దాని పొగను పీల్చడం వల్ల ఆస్తమా, శ్వాస ఆడకపోవడం వంటి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. ఇందులోని రసాయనిక అణువులు ఛాతీలోని శ్లేష్మాన్ని బయటకు పంపేందుకు సహకరిస్తాయి.
బహిష్టు సమయంలో స్త్రీలలో వచ్చే పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పిని తగ్గిస్తుంది. అయితే రోజూ 5 నుంచి 30 మి.గ్రాముల ఇంగువను మాత్రమే తీసుకోవడం మంచిది. అధికంగా తీసుకుంటే శరీరంలో పిత్తం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.