అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని, పాలతో కాకుండా జాజికాయ ఊరగాయ రూపంలోనూ, చూర్ణంగానూ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో మరిగించి సేవించాలి. ఇది సంతాన లేమిని తొలగిస్తుంది. మగతనాన్ని రెచ్చగొడుతుంది. నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.
ఇంకా జాజికాయ పొడిని చందనంతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం ప్రకాశంవంతంగా మారుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో జాజికాయ నూరి పూతలా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా తామర వంటి చర్మ వ్యాధులు కూడా దూరమవుతాయి.
ఎండకు కమిలిపోయిన చర్మానికి జాజికాయ పొడిని, తేనెలో కలిపి ట్యాన్ అయిన ప్రదేశంలో రాసి ఒక 10 నిమిషాల తరవాత చల్లటినీటితో కడిగితే కొన్నాళ్ళకు ట్యాన్ మొత్తం పోతుంది. చికెన్ ఫాక్స్ ఉన్నవారికి జాజికాయ, జీలకర్ర, శొంఠి పొడుల్ని ఆహారానికి ముందు పావు స్పూన్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.