శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల గొంతునొప్పి వస్తుంది. దీంతో వాయిస్ సరిగ్గా రాకపోవడం, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల నుండి అతి సులభంగా ఉపశమనం పొందాలంటే కొన్ని పాటి ఆహార నియమాలు పాటించాలని చెప్తున్నారు.
స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వలన గొంతులో ఇబ్బందిగా అనిపిస్తుంది. తద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి వస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. మిరియాలను సూప్స్, టీ లో అల్లం చేర్చి తాగడం వల్ల గొంతునొప్పి నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా గొంతునొప్పి ఉండే సమయంలో చల్లని నీరు, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
మిరియాల సూప్స్ గొంతు నొప్పిని చాలా సులభంగా తగ్గిస్తాయి. ఎక్కువగా గొంతు నొప్పితో బాధపడుతుంటే కనుక గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే గొంతునొప్పితో పాటు, ఇన్ఫెక్షన్ కూడా తొలగిపోతాయి. గొంతునొప్పి మరీ ఎక్కువగా ఉంటే తేనె, నిమ్మరసం గోరువేచ్చని నీటిలో కలిపి తాగితే మంచి ఫలితాన్నిస్తుంది.
గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిళించాలి. ఇలా చేస్తే గొంతునొప్పి మటుమాయం. మనం సాధారణంగా ఇంట్లో వంటకు ఉపయోగించే వస్తువులు గొంతు నొప్పిని కూడా నివారిస్తాయి. ఉదాహరణకు అల్లం టీ గొంతు నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు గొంతు ఇన్ఫెక్షన్‌ను కూడా నివారిస్తుంది.