కట్టుకున్న భార్యపై ఓ భర్త చేసిన ఫిర్యాదు వింతగాను, విచిత్రంగానూ ఉంది. తన భార్య రాత్రి పూట నాగినిలా మారి కాటేస్తోందని జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో జరిగింది.
జిల్లాలోని లోద్సా గ్రామానికి చెందిన మీరజ్ అనే వ్యక్తి ప్రజావాణి అనే కార్యక్రమానికి వచ్చి జిల్లా మేజిస్ట్రేట్‌కు ఓ ఫిర్యాదు పత్రం అందజేశాడు. అందులో తన భార్య నసీమున్ రాత్రిపూట నాగినా మారి వేధిస్తోందంటూ, రాత్రి అయితే సర్పంలా మారిపోయి తనను కాటేస్తుందని అందులో పేర్కొన్నాడు.
అనేకసార్లు తన భార్య తనను చంపేందుకు ప్రయత్నించిందన్నారు. కానీ ప్రతిసారీ ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు నిద్రలేస్తున్నట్టుగా చెప్పాడు. భార్య మానసికంగా వేధిస్తున్నదని, నిద్రిస్తున్న సమయంలో ఏదో ఒక రాత్రి తనను చంపేస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ ఫిర్యాదను స్వీకరించిన జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. దీనిపై దృష్టిపెట్టాలని సబ్ డిజివనల్ మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీచేశారు. మీరజ్ ఫిర్యాదు పట్ల పోలీసులు ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు. అయితే, ఈ ఫిర్యాదుపై నెటిజన్లు ఆన్‌లైనులో తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు.