పనసకాయ గింజల్లో ఏముంది.. అనుకునేరు..? చల్లటి పాలలో..? (video)

గురువారం, 25 జూన్ 2020 (13:35 IST)
Jack fruit seeds
పనసకాయ గింజల్లో ఏముంది.. అనుకునేరు.. పనసకాయ గింజల్లో మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చే శక్తి వుంది. కళ్లు, జుట్టును ఆరోగ్యంగా వుంచేందుకు పనస గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. పనసకాయ గింజల్లో జింక్, ఇనుము, కాల్షియం, రాగి, పొటాషియం, మెగ్నీషియం వంటి చిన్న మొత్తంలో ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి.
 
పనసకాయ గింజల్లో యాంటీమైక్రోబయల్ ప్రభావాన్ని కలిగి ఉన్న సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆహార వ్యాధులకి కారణమయ్యే బ్యాక్టీరియా కలుషితాన్ని నివారించడంలో సహాయపడతాయి. చర్మంపై ముడతలు రాకుండా ఉండటానికి పనసకాయ గింజలను తీసుకొని చల్లటి పాలలో కొంచెం సేపు నానబెట్టి తర్వాత పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ పేస్టును ముఖంపై రాస్తే మంచి ఫలితం వుంటుంది. నిత్య యవ్వనులుగా వుంటారు. 
 
పనగ గింజలను కొంచెం పాలు, తేనెతో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖంపై అప్లై చేసి.. అర గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. పనసకాయ గింజల్లోని ధాతువులు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పనస గింజలు పెంచుతాయి. ఇందులోని ఐరన్ మెదడు, హృదయాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది.
 
పనసకాయ గింజలు విటమిన్ ఎ కలిగి ఉన్నందున మంచి కంటి చూపును కాపాడుకోవడంలో సహాయపడతాయి. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలలో ఒకటి. ఈ విటమిన్ అధికంగా ఉండే ఆహారం రాత్రిపూట ఉండే రేచీకటిని తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ ఆరోగ్యకరమైన జుట్టునిస్తుంది. పనస గింజల పొడి అజీర్తికి చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు