పనసలో రెండు రకాలున్నాయి... ఏ రకం పనస తొనలు తినాలో తెలుసా?

మంగళవారం, 14 మార్చి 2017 (20:32 IST)
పనస కాయలు గురించి మనకు తెలుసు. ఈ పనసలో రెండు రకాలున్నాయి. అందులో ఒకటి పీచు పనస, రెండోది పెళుసు పనస. ఈ రెండింటిలో పెళుసు పనస ఆరోగ్యానికి శ్రేష్టం అంటారు ఆయుర్వేద నిపుణులు. ఇది శరీర పుష్టిని కలిగిస్తుంది. వేడి చేస్తుంది. వాతాన్ని కలిగిస్తుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మెదడు, నరాలు, కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది.
 
ఐతే ఇది జీర్ణమవడం కాస్త కష్టంగా జరుగుతుంది. ఈ పనసను ఎక్కువగా తింటే నెమ్ము చేస్తుంది. రక్తాన్ని బయటకు పంపే వ్యాధులను కలిగిస్తుంది. అజీర్ణ రోగులకు ఇది మంచిది కాదు. మలబద్ధకాన్ని కలిగిస్తుంది. ఇక పనస చెట్టు పాలను ద్రాక్ష రసంలో కలిపి నూరి పైన పట్టుగా వేస్తే దెబ్బలు తగిలిన వాపులు,  నొప్పులు తగ్గిపోతాయి.

వెబ్దునియా పై చదవండి