గుండెజబ్బుతో బాధపడుతున్న మహిళలు, వంశపారంపర్యంగా గుండె సంబంధ వ్యాధులతో భాదపడుతున్న మహిళలు, లావుగా ఉన్నవారు... గుండెను పదికాలాలపాటు చక్కగా ఉంచుకోవాలంటే... అందుకు మేలు చేసేందుకు ఎలాంటి ఆహారం తోడ్పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
ముఖ్యంగా ఇలాంటి వారు ఎక్కువగా ఆంటీయాక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే ముఖ్యంగా విత్తనాలు, పప్పుగింజలు, టీ, సోయా, చేపలు లాంటివి మీ వంటింట్లో ఉంటే... ఆరోగ్యవంతమైన గుండె మీకు సొంతమైనట్లే...!
గుండెకు మేలుచేసే చేపలు
కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండే చేపలలో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం మూలాన ఇది గుండెకు మేలు చేస్తుంది. చేపలు రక్తనాళాలని కోలెన్‌గా ఉంచటమే గాకుండా, శరీరంలో మంచి కొవ్వు శాతాన్ని పెంచుతాయి. వారానికి రెండుసార్లు చేపలను ఆహారంలో తీసుకోవడం ఉత్తమం...
గింజలంటే ఏవేవి... బాదం, వాల్‌నట్స్ (అక్రోట్ పప్పు), జీడిపప్పు, వేరుశెనగపప్పు. వీటిలో అన్‌సాట్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. అంతేగాకుండా వీటిలో గుండెకు మేలు చేసే ఎమినో ఆసిడ్ కూడా ఉంటుంది. ఇది న్యూట్రిక్ యాక్సైడ్ రక్తనాళాలని రిలాక్స్ చేసి, రక్త ప్రసరణ సాఫీగా జరిగేలాగా చూస్తుంది.
ఈ గింజలలో ఇంకా "విటమిన్ ఇ" సమృద్ధిగా ఉండటంవల్ల శరీరానికి మంచి యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అయితే ఈ గింజలలో కేలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం.
ఇక పప్పు గింజల విషయానికి వస్తే.... తొక్కు తీయని పప్పు గింజలలో ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఒక కప్పు గింజలను తీసుకుంటే శరీరానికి కావల్సిన పీచు పదార్థాల్లో సగభాగం అందినట్లే...! అంతేకాకుండా, ఫోలిక్ యాసిడ్, "విటమిన్ బి" వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి దేహంలోని రక్తనాళాలను పరిశుభ్రంగా ఉంచుతాయి.
అధిక ఒత్తిడి వల్ల మన శరీరంలో హోమోస్టైన్ నిల్వలు పెరగడం వల్లనే గుండెపోటు సంభవిస్తుంది. కనుక రోజులో ఒక కప్పు పప్పు గింజలను తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం నుండి బైటపడవచ్చు.
ఇక టీలో కూడా మన శరీరానికి అవసరమైన చాలా రకాల యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి. యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డామేజీ లేకుండా చేస్తాయి. టీ తాగడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అయితే రోజుకు కనీసం నాలుగు కప్పుల టీ మాత్రమే తీసుకోవాలి. పంచదార, పాలు లేకుండా, ఒట్టి టీఆకుతో, బాగా మరగనివ్వకుండా వేడిచేసిన టీ తీసుకుంటే మరీ మంచిది. టీలో గ్రీన్ టీ అన్నింటికన్నా ఆరోగ్యానికి శ్రేష్టకరం.
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సోయా, చేపల గురించే...! సోయా పాలు, సోయా చీజ్, సోయా నట్స్, సోయా పిండి ఇలా ఏదో ఒకదాన్ని ప్రతిరోజూ ఆహారంలో కలిపి తీసుకోవడం వల్ల మహిళల గుండె పదికాలాలపాటు చల్లగా ఉంటుంది. సోయా కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. అంతేగాక రక్తప్రసరణ సక్రమంగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ నివారిణిగా, పనిచేసే సోయా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచిది.
కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండే చేపలలో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం మూలాన ఇది గుండెకు మేలు చేస్తుంది. చేపలు రక్తనాళాలని కోలెన్‌గా ఉంచటమే గాకుండా, శరీరంలో మంచి కొవ్వు శాతాన్ని పెంచుతాయి. వారానికి రెండుసార్లు చేపలను ఆహారంలో తీసుకోవడం ఉత్తమం.