వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవాలంటే..?

బుధవారం, 11 ఫిబ్రవరి 2015 (15:25 IST)
వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవాలంటే..? వాల్ నట్స్‌ను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. వాల్ నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో.. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తుంది. 
 
ఈ యాంటీఆక్సిడెంట్ ఫ్రూట్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. సెల్ డ్యామేజ్‌ను రిపేర్ చేస్తుంది, ఇంకా స్కిన్ టోన్ మెరుగుపరచి, వృద్ధాప్య ఛాయలు కనబడనివ్వకుండా, చర్మం ప్రకాశంతంగా కనబడేలా చేస్తుంది.
 
ముఖంలో చారలు, ముడతలు లేదా స్పాట్స్ వంటి వాటిని నివారించుకోవడానికి వాల్ నట్స్(అక్రోట్స్)ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు .

వెబ్దునియా పై చదవండి