మహిళలు రోజుకో అరటిపండు తింటే లాభమేంటి?

సోమవారం, 6 అక్టోబరు 2014 (17:50 IST)
మహిళలు రోజుకో అరటిపండు తింటే లాభమేంటి? అనేది తెలుసుకోవాలా అయితే చదవండి. 50కి పైబడిన మహిళల్లో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉంటే వారికి గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
 
ప్రతి మనిషికీ రోజుకి 4700 మిల్లీగ్రాముల పొటాషియం తీసుకుంటే మంచిది. ఇలా తీసుకున్న వారికి, పొటాషియం తగిన మోతాదులో తీసుకోని మహిళలతో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశం 12 శాతం తక్కువగా ఉంటుందని తేలింది. 
 
అందుకే మెనోపాజ్‌కు దగ్గర పడుతున్న వారు పొటాషియం ఎక్కువగా ఉన్న పాలకూర, చిలగడదుంపలూ, టొమాటో, మష్రూమ్ తింటే 420 మి.గ్రాములు పొటాషియం అందుతుంది. అలాగే రోజుకో అరటి పండు తింటే మహిళల ఆరోగ్యానికి తగినంత పొటాషియం అందుతుంది. 

వెబ్దునియా పై చదవండి