మహిళలూ డైటింగ్ వద్దు..

బుధవారం, 24 డిశెంబరు 2014 (15:18 IST)
మహిళలు బరువు పెరగకూడదనే ఆలోచనతో చిన్న వయసు నుంతే డైటింగ్ చేస్తే దీర్ఘకాలంలో అనేక దుష్ప్రభావాలకు  లోను కావలసి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. డైటింగ్ దెబ్బతో మహిళలు 25 ఏళ్లు దాటే సరికే ఎప్పుడూ ఏదో తినాలనిపిస్తుండటం లేక అసలేమీ తినలేక పోవడం వంటి (ఈటింగ్ డిజార్డర్) సమస్యకు లోనవుతున్నారు. శారీరక సమస్యగా కనిపిస్తుంది కానీ ఇది మానసిక సమస్య అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
డైటింగ్ ప్రభావం ఆరోగ్యం పైనే కాకుండా మానసికతపై ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలినట్లు నిపుణులు వెల్లడించారు. ఇలాంటి వారిలో ఏ భావన అయినా తీవ్రస్థాయిలో వ్యక్తం కావడం వంటి చిత్రవిచిత్ర ప్రవర్తన ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి