డ్రై ఫ్రూట్స్‌తో హెల్దీ హెయిర్ పొందాలంటే.. ఏం చేయాలి?

బుధవారం, 11 మార్చి 2015 (17:56 IST)
డ్రై ఫ్రూట్స్‌తో హెల్దీ హెయిర్ పొందాలంటే ఈ టిప్స్ పాటించండి. వాల్ నట్స్‌లో విటమిన్ ఇ ఎంతగానో తోడ్పడుతుంది. కేశాలకు కావలసిన పోషకాలు అందించే గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి. ఇది తల మాడుకు రక్త ప్రసరణను బాగా అందజేస్తుంది. అంతే కాదు వాల్ నట్స్‌లో జింక్ అధిక శాతం కలిగి ఉంటుంది. జింక్ శరీరానికి అంధించడం వల్ల కేశాలకు మంచి మెరుపు వస్తుంది.
 
అలాగే ఎండు ద్రాక్షలో ఐరెన్ ఎక్కువగా ఉండి, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి శరీరానికికే కాకుండా కేశాలకు అందజేస్తుంది. కేశాలకు తగినంత రక్త ప్రసరణ జరిగేందుకు కావల్సిన హెయిర్ పాలిసెల్‌కు కావల్సిన న్యూట్రియట్స్‌ను అందజేస్తుంది. అలాగే రోజుకు రెండు బాదం గింజల్ని తీసుకోవడం ద్వారా జుట్టును దట్టంగా పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి