ఎండు ద్రాక్షలను రోజూ గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండుద్రాక్షలను తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలోని ఆమ్లాలు తొలగిపోతాయి. జ్వరం, జలుబు, దగ్గు నయం అవుతుంది. సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది.
మహిళలు నిత్యం ఎండుద్రాక్షలను తీసుకుంటే మూత్రాశయంలో అమోనియా పెరగదు. తద్వారా రాళ్లు కూడా ఏర్పడవు. ఎండు ద్రాక్షలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఇవి రక్తహీనతకు మంచి మందుగా పనిచేస్తాయి. మహిళలకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. ఎండు ద్రాక్షల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. దంత సమస్యలను ఇవి దూరం చేస్తాయి.