గర్భిణీ మహిళలు ఉడకని, వండని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. పచ్చి గుడ్లు, పచ్చి మాంసం, చేపలను పూర్తిగా తీసుకోకూడదు. సరిగ్గా ఉడకని, పచ్చి సీ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల తల్లికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
అంతే కాకుండా, కొన్ని రకాల వ్యాధులకు కూడా గురయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇటువంటి ఆహార పదార్థాల ద్వారా గర్భిణికి ఇన్ఫెక్షన్ సోకినట్లయితే గర్భస్థ శిశువుకు కూడా ప్లాసేంటా ద్వారా ఈ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. వీటివల్ల శిశువు నెలలు నిండకుండానే పుట్టే ప్రమాదం ఉంది. శిశువులో మానసిక అనారోగ్యాలు కూడా చేరతాయి.
అన్ పాశ్చరైజ్డ్ చీజ్ లేదా మిల్క్‌లో ఉండే బాక్టీరియా ప్లాసెంటాని దాటుకుని గర్భస్థ శిశువు వరకు చేరి మిస్ క్యారేజ్‌ను కలిగించే అవకాశం కలదు. ముందు జాగ్రత్తగా మిల్క్‌ను, ఛీజ్‌ను కొనుక్కునే ముందు లేబుల్స్‌ను చెక్ చేసుకోవడం మంచిదని గైనకాలజిస్టులు అంటున్నారు.