పవన్ కల్యాణ్ ఓడిపోయినా... నిలబడ్డారు: ప్రకాశ్ రాజ్-ప్రెస్ రివ్యూ

మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (09:54 IST)
పవన్‌ది, తనది ఒకే భావజాలం అని నటుడు ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. పవన్‌ను చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించాను. ఆయనతో రాజకీయంగా నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పవన్ మాట్లాడుతూ... ప్రకాష్ రాజ్‌తో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన అభిప్రాయాలను గౌరవిస్తాను అన్నారు.
 
పవన్ ఒక లీడర్. ఆయన్ను ప్రేమిస్తాను కాబట్టే పవన్ అలా ఉండాలని కోరుకుంటాను అని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. సెట్‌లో నాకు పవన్ కల్యాణ్‌కు మధ్య మంచి చర్చలు సాగేవి. ప్రొటెస్ట్ పొయెట్రీ కర్ణాటకలో ఎలా ఉంటుంది.. నాకు పుస్తకాలు కావాలి అని ఆయన నన్ను అడిగారు. అలాగే నా దోసిట చినుకులు పుస్తకాలు చదివి మీ ఐడియాలజీ బాగుంది అని పవన్ అన్నారు. మా మధ్య ఇలాంటి చర్చలు చాలా జరిగాయి అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.
 
పవన్ కల్యాణ్‌కు‌, నాకు సమాజం పట్ల, ప్రజల పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మహిళల గురించి ఇంకా సినిమాలు రావాలి. పురుషుల్లో మార్పు రావాలి. తల్లిదండ్రులు అబ్బాయిల్ని పెంచేప్పుడే సన్మార్గంలో పెట్టాలి. మహిళల్ని గౌరవించడం నేర్పాలి. నేను ఈ సినిమాలో అమ్మాయిల్ని బాధ పెడుతూ ప్రశ్నించాను. 'ఆర్ యూ వర్జిన్' అని అడిగినప్పుడు బాధగా అనిపించింది. అయితే నేను నటుడిని, నా క్యారెక్టర్ ప్రకారం నటించాను. కానీ లోపల బాధగానే అనిపించింది.
 
పవన్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓడిపోయారు. రాజకీయం మనం అనుకునే దాని కంటే సంక్లిష్టమైనది. ఓడిపోయినా ప్రజల కోసం పవన్ నిలబడ్డారు. అదీ గొప్ప రాజకీయ నాయకుడి లక్షణం. పవన్‌లో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని ప్రకాశ్ రాజ్ అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు