ముఖంపై పెరుగును అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

సిహెచ్

గురువారం, 21 మార్చి 2024 (20:05 IST)
మహిళలు ఎక్కువగా ఉపయోగించే చర్మ సంరక్షణ పదార్థాలలో పెరుగు ఒకటి. పెరుగు మన వంటింట్లో సిద్ధంగా వుంటుంది. పెరుగుని చర్మంపై మర్దించడం వల్ల మేలు కలుగుతుంది. ముఖంపై పెరుగును మర్దిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పెరుగును చర్మానికి లేపనంగా పూయడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు చెపుతున్నాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై మృతకణాలను తొలగించి మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగులో ఉండే కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో దోహదపడుతుంది.
పెరుగును ముఖంపై వాడటం వల్ల అది మొటిమలను తగ్గిస్తుంది.
పెరుగులో అధికంగా ఉండే కొవ్వు పదార్ధం చర్మంలో తేమను ఉంచడంలో సహాయపడుతుంది.
పెరుగును ముఖంపై అప్లై చేస్తే అది పిగ్మెంటేషన్‌ను పరిష్కరించడానికి సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు