మొటిమలకు చెక్ పెట్టాలా? విటమిన్ ''ఈ''తో కూడిన ఆయిల్స్ వాడండి!

మంగళవారం, 5 జులై 2016 (11:30 IST)
మొటిమలు తగ్గాలా అయితే ''ఈ''విటమిన్ కలిగిన ఆయిల్‌ను వాడితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మచ్చలను తగ్గించే ఆయింట్మెంట్, క్రీమ్‌లలో విటమిన్ 'ఈ' ఆయిల్ మూల పదార్థం ఉండేలా చూసుకోవాలి. ఆలివ్, ఆల్మెండ్ ఆయిల్‌లను ఉపయోగించడం ద్వారా మచ్చలను దూరం చేసుకోవచ్చు.  శస్త్రచికిత్స వలన ఏర్పడిన గాయాలను, వాటి మచ్చలను తగ్గించుకోటానికి కూడా ఈ ఆయిల్‌ను ఉపయోగించాలి.
 
విటమిన్ 'ఈ' చర్మాన్ని మృదువుగా మార్చి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫ్రీ రాడికల్‌ల వలన చర్మానికి కలిగే నష్టాలను, మచ్చలను విటమిన్ 'ఈ' లో యాంటీ ఆక్సిడెంట్ కలగకుండా చూస్తాయి. అంతేకాకుండా, ఇవి సూర్యకాంతి నుండి చర్మాన్ని సంరక్షించి, ప్రమాదకర అతినీలలోహిత కిరణాల నుండి కాపాడతాయి.
 
ఎలా వాడాలంటే..?
విటమిన్ "ఈ" ఆయిల్‌ను నేరుగా మొటిమల వలన ఏర్పడిన మచ్చలపై రాయడం చేయొచ్చు లేదంటే విటమిన్ "ఈ" క్యాప్సుల్‌ల రూపంలో కూడా లభిస్తుంది. విటమిన్ "ఈ" క్యాప్సుల్ ను తీసుకొని, ఇంజెక్షన్ సహాయంతో కూడా వీటిని తీసుకోవచ్చు. ముఖాన్ని శుభ్రంగా కడిగిన తరివాత ఈ నూనెను నేరుగా అప్లై చేయండి. మంచి ఫలితాలను పొందండి అంటున్నారు స్కిన్ కేర్ నిపుణులు. 

వెబ్దునియా పై చదవండి