మొటిమలు, మచ్చలు తగ్గిపోయేందుకు చిట్కాలు...

సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (22:51 IST)
గిన్నెలో కొంచెం వేడినీళ్లు తీసుకొని అందులో 4-5 వేపాకులేసి ముఖానికి ఆవిరి పట్టి చల్లారిన తర్వాత ఆ వేపనీటితోనే ముఖం కడుక్కుంటే మొటిమలు మాయమవుతాయి.
 
వివిధ రకాల నూనెల వల్ల మొటిమలు రాకుండా వుండేందుకు సున్నిపిండితో నిమ్మరసం కలిపి రుద్దుకుంటుండాలి.
 
ప్రతిరోజూ ముఖానికి చిక్కుడు ఆకులరసం రాసుకోవడం వల్ల అన్ని రకాల మచ్చలు త్వరలోనే తగ్గిపోతాయి. 
 
కొన్ని బీర ఆకుల్ని, పసుపు, నిమ్మరసంతో మెత్తగా నూరి మొటిమలు, మచ్చలపై రాసి అర్థగంట తర్వాత కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తుంటే మచ్చలు తగ్గిపోతాయి.

వెబ్దునియా పై చదవండి