చుండ్రు (డాండ్రఫ్) నివారించేందుకు చిట్కాలు...

శనివారం, 7 మే 2016 (17:32 IST)
* నిమ్మరసాన్ని మాడుకి పట్టించి పావుగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి జుట్టు మెరుస్తుంది.
* ఒక గిన్నెలో బీట్‌రూట్ ముక్కలు వేసి నీళ్లు చిక్కటి రంగులోకి మారే వరకు ఉడికించాలి. ఈ నీళ్లతో మాడుపై మర్దనా చేసి అరగంట తరువాత తలస్నానం చేస్తే చుండు పోతుంది (మర్దనా చేసేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నుదుటి మీదకి నీళ్లు కారకుండా చూసుకోవాలి.)
* మాడుపై ఉండే చర్మం పొడి బారడం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఇలాంటప్పుడు ఆయిల్ ట్రీట్‌మెంట్ బాగా పనిచేస్తుంది. కొబ్బరి, ఆలివ్, రోజ్‌మేరీ, లావెండర్ నూనెల్లో నచ్చిన నూనెని వేడిచేసి మాడుకి మర్దనా చేసి వేడి నీళ్లలో ముంచిన తుండుని తలకు చుట్టుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి.
* టీ ట్రీ ఆయిల్ సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీబాక్టీరియల్. అందుకని ఇది కూడా చుండ్రుని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. టీట్రీఆయిల్‌ని మాడుకు పట్టించి పావుగంట తరువాత తలస్నానంచేయాలి. లేదా షాంపూలో కొన్ని చుక్కల టీట్రీఆయిల్‌ని కలుపుకున్నా ఫలితం ఉంటుంది.
* బీర్‌లో విటమిన్ బి, ఈస్ట్‌లు మెండుగా ఉంటాయి. ఈ రెండూ చుండ్రు కారకాలకు బద్ధశత్రువులు. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా దీంతో మటుమాయమవుతుంది. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బీరుని తలకు పట్టిస్తే మాడుకి పట్టిన చుండ్రు వదులుతుంది.
* పైన చెప్పినవన్నీ చుండ్రు వచ్చాక దాన్ని పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చుండ్రు అసలు రాకుండా ఉండాలంటే నీళ్లు సరిపడా తాగాలి. సమతులాహారాన్ని తినాలి. బి విటమిన్, జింక్‌లను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చుండ్రు పోవడంతో పాటు చర్మం నిగారింపుసంతరించుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి