ఎండు ఉసిరి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకొని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి క్రమంతప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
కొబ్బరినూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నెరిసిపోకుండా ఉండటానికి ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
రెండు టేబుల్ స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకొని మూడింటిని బాగా కలపాలి. దీన్ని జుట్టు చివర్లకు వచ్చేలా రాసుకొని పదిహేను నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగటమే కాకుండా చివర్లు చిట్లిపోకుండా అందంగా వంపు తిరిగి ఉంటాయి.