మొటిమలతో టీనేజీ యువతులు ఇబ్బందిపడుతుంటారు. ఇందుకు రకరకాల క్రీములు వాడుతూ ముఖాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
ఇంకా శొంఠి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారు చేసి ముఖంపై తరుచూ రాస్తూ ఉంటే మొటిమలు తక్షణమే తగ్గుముఖం పడతాయి. మొటిమ గనక చితికినట్లయితే దానిమీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.