వేడినూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుంటే.. జుట్టు మృదువుగా..?

సోమవారం, 17 అక్టోబరు 2016 (10:36 IST)
వేడినూనెతో రాత్రి హెడ్ మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసినట్లైతే జుట్టు మృదువుగా తయారవుతాయి. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్స్ ఆయిల్ నూనెవు తీసుకుని ఒక గిన్నెలో కలుపుకుని.. పది సెకన్ల పాటు ఈ ఆయిల్‌ని మైక్రోవేవ్‌లో వేడి చేయాలి.

మూడు చుక్కలు సుగంధ తైలాలైన రోజ్ మేరీ మరియు లావెండర్ నూనెల్లోని రెండు చుక్కలు ఈ వేడి నూనెకి జోడించండి. చెక్క గరిటెతో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.
 
తర్వాత తయారు చేసుకున్న నూనెని కొంచెం చేతికి వెనుక భాగంలో రాసుకుని నూనె వేడి సరిపోయినట్లుగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. నూనె వేడి తగినట్లుంటే.. తలపై ఉండే చర్మంపై నూనెతో మర్దన చేసి, జుట్టు చివరి వరకు నూనెతో రాసుకోవాలి. ఇలా రాసుకున్న 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. అంతేగాకుండా జుట్టు మృదువుగా, దృఢంగా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి