ఉల్లిపాయ రసంతో జుట్టుకు మేలెంత.. తెలుసుకోండి..

శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (13:46 IST)
ఉల్లిపాయ రసంతో జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇది కెరటిన్, మాంసకృత్తుల్ని అందించి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ ముక్కల రసాన్ని తలకు రాసుకుని, ఇరవై నిమిషాల తరవాత షాంపూతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఓసారి మాసానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 
అలాగే ఆమ్లాలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. జుట్టు రంగు మారకుండా కూడా చేస్తుంది. రెండు చెంచాల ఉసిరి రసం లేదా ఉసిరి పొడిని నిమ్మరసంతో కలిపి తలకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే, చిన్న వయస్సులోనే జుట్టు నెరవడానికి చెక్ పెట్టొచ్చు. ఇక జుట్టు రాలే సమస్యకు నిమ్మరసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
నిమ్మరసం.. జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాదు, ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది నిమ్మ. కొద్దిగా కొబ్బరినూనెలో నిమ్మరసం వేసుకుని తలకు పట్టించుకోవాలి. గంటయ్యాక కడిగేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి