అమ్మాయిలను వేధించే మొటిమలు... ఇలా పోగొట్టవచ్చు...

మంగళవారం, 23 జనవరి 2018 (16:57 IST)
ముఖంపై చిన్న మొటిమలు వస్తే చాలు... కంగారుపడిపోతుంటారు. రకరకాల క్రీములు రాయడం మొదలుపెట్టేస్తారు. కానీ  దానికి బదులుగా ఇలా చేస్తే మొటిమలు సమస్య చాలా సులువుగా తగ్గిపోతుంది.
 
1. చర్మంలోని అధిక జిడ్డుని తొలగించి మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది బొప్పాయి. అందువల్ల బాగా పండిన బొప్పాయి గుజ్జులో కొద్దిగా చక్కెర, పెరుగు కలిపి ముఖానికి రాసి కాసేపు మర్దనా చేయాలి. అది పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి.
 
2. పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు రాత్రిపూట ముఖానికి రాసి ప్రొద్దుట గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ విధముగా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు పోతాయి.
 
3. రెండు చెంచాల తేనె, కొద్దిగా పాలు, చెంచా దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడమే మచ్చలు కూడా మాయమవుతాయి.
 
4. రెండు చెంచాల నారింజ తొక్కలపొడిలో కొంచెం పాలు కలిపి ముద్దలా చేసుకోవాలి. దీనిని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగివేయాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా చర్మం కొత్త మెరుపుతో కనిపిస్తుంది.
 
5. అరటిపండు తొక్కలో ల్యూటిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. అరటి పండు తొక్కని ముఖంపై వలయాకారంలో పదిహేను నిమిషాలు రుద్దాలి. అరగంట తర్వాత కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.
 
6. పచ్చి బంగాళాదుంప ముక్కను తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాలు రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి. చర్మం కూడా తాజాగా కనిపిస్తుంది.
 
7. కొంచెం వేపాకు మెత్తగా నూరి దానికి చందనం పొడి కలిపి మొటిమల మీద పూసి గంట తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు