2. టమోటోను తీసుకొని వాటిని బాగా గుజ్జులా తయారుచేసి అందులో కొద్దిగా ఓట్ మీల్ మరియు ఒక చెంచా పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్ టాన్ తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
3. వెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో, తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి మొటిమలు మీద రాసి , 10 నుండి 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.
4. ఒక క్యారెట్‌ని తురుముకుని కొంచెం నీరు పోసి ఉడకపెట్టాలి. చల్లారిన తరువాత కొంచెం పాలు కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆగిన తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.