చర్మానికి ఎప్పుడూ సహజ నూనెలు చాలా అవసరం. అది జిడ్డు చర్మతత్వమైనా సరే. కొబ్బరి, ఆలివ్, బాదం, విటమిన్ ఇ. ఇలా ఏ నూనెలు రాసినా ఇబ్బంది ఉండదు. కనీసం రోజుకోసారి లేదంటే రెండ్రోజులకో సారైనా ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ, ముఖ కండరాలు ఉత్తేజితమవుతాయి.
నూనెలతో మర్దన చేసుకోవడం వల్ల కందిపోవడం, దద్దుర్లు రావడం, చర్మం సాగిపోవడం వంటివి దూరమవుతాయి. ముఖ్యంగా విటమిన్ ఇ నూనె రాసుకోవడం వల్ల చర్మ కణాలు పునర్నిర్మితమవుతాయి. ఇది అన్ని చర్మ తత్వాల వారికి మేలు చేస్తుంది. అలానే ఇప్పుడు మార్కెట్లో అన్ని జిడ్డు చర్మం తత్వం వారికీ సరిపడే నూనెలు వచ్చాయి.