పొడిబారిన జట్టుతో ఇబ్బందులు పడుతున్నారా? జుట్టు రాలిపోకుండా ఉండాలా? అయితే ఈ టిప్స్ పాటించండి. కలబంద గుజ్జును నాలుగు టీ స్పూన్లు తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బరి నూనె, పెరుగు కలిపి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు పొడిబారటం తగ్గిపోతుంది. తలస్నానం చేసే ముందురోజు వేరుశనగ నూనె, బాదం నూనె, కొబ్బరి నూనెలను సమపాళ్ళలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.
అలాగే గుడ్డులోని తెల్లసొనను తలకు పట్టిస్తే ఈ పోషకాలన్నీ జుట్టుకు అందుతాయి. గుడ్డులోని తెల్లసొనలో మూడు చెంచాల వెనిగర్, ఒక చెంచా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు తిరిగి తేమ అందుతుంది. పొడిబారటం తగ్గుతుంది.