జులైలో 41 శాతం పెరిగిన కార్ల ఎగుమతులు

యూరపేతర దేశాలలో ఇటీవలి మాసాల్లో డిమాండ్ పెరిగిన కారణంగా జులైలో భారత్ నుంచి ప్యాసెంజర్ కార్ల ఎగుమతులు 40.83 శాతం వృద్ధి చెందినట్లు భారత ఆటోమోబైల్ తయారీదారుల సమాఖ్య (ఎస్ఐఏఎం) బుధవారం పేర్కొన్నారు. ఎస్ఐఏఎం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కార్ల తయారీదారులు గత నెలలో 48,091 యూనిట్లను విదేశాల్లో విక్రయించారు. కాగా గత ఏడాది ఇదే నెలలో జరిగిన విక్రయాలు 34,149 యూనిట్లు.

కార్ల ఎగుమతిదారులు తమ అమ్మకాలను పెంచుకోవడానికి లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి నూతన మార్కెట్లపై దృష్టి సారించారు. ద్విచక్ర వాహనాల ఎగుమతులు జులైలో 29.42 శాతం పెరిగి 1,75,970 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 1,30,148 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

వెబ్దునియా పై చదవండి